Tuesday, January 21, 2025

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇది గొప్ప విజయం: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని అమిత్ షా తెలిపారు. ఛత్తీస్‌గడ్‌ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న బలగాలపై ప్రశంసలు జల్లు కురుపించారు. మన భద్రతాదళాలకు ఇది గొప్ప విజయమని, నక్సల్స్ రహిత భారత్ దిశగా ఇది కీలక అడుగు అని కొనియాడారు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ లో 16 మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత చలపతి మృతి చెందారు. చలపతి తలపై కోటి రూపాయల రివార్డు ఉంది. చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా వాసి. ఈ ఎన్ కౌంటర్ కేంద్ర కమిటీ సభ్యులు మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డూ, ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News