Monday, December 23, 2024

మణిపూర్ మోరేలో అమిత్‌షా

- Advertisement -
- Advertisement -

మోరే : ఘర్షణల మణిపూర్ పర్యటనలో భాగం గా కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం సరిహద్దు పట్టణం మోరేలో పర్యటించారు. చైనాకు సరిహద్దుల్లోని ఈ ప్రాంతం ఇప్పటి ఘర్షణల దశలో అత్యంత సునిశిత కేంద్రంఅయింది. ఇక్కడి భద్రతా పరిస్థితిని, చేపట్టిన చర్యలను కేంద్ర హోంమంత్రి ఉన్నతాధికారుల స్ధాయి సమీక్షలో చర్చించారు. ప్రత్యేకంగా కుకీలు ఇతర ప్రధాన తెగల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. మణిపూర్‌లో కుకీలు, మైతీలు, నాగాల మధ్య వైరం అదుపు తప్పిన పరిస్థితి ఏర్పడింది. ఈశాన్య సరిహద్దు రాష్ట్రం కావడంతో ఇక్కడి సంక్లిష్టత కేంద్రానికి ఆందోళన కల్గిస్తోం ది. రాష్ట్రంలో తమ మూడో రోజుల పర్యటనలో భాగంగా తాను కుకీ తెగలప్రతినిధి బృందాన్ని కలిసినట్లు, అదే విధంగా ఇతర వర్గాల వారితో నూ మాట్లాడానని తెలిపిన అమిత్ షా రాష్ట్రంలో సాధారణ పరిస్థితుల కల్పనకు తీసుకునే చర్యల దిశలో వారి సంపూర్ణ మద్దతు ప్రకటించారని వివరించారు. ఇక్కడి సీనియర్ అధికారులతో తాను పరిస్ధితిని క్షుణ్ణంగా చర్చించినట్లు ఆ తరువాత అమిత్ షా విలేకరులకు తెలిపారు.

వలసల సంక్లిష్టతల మయన్మార్ సరిహద్దుల్లో
మణిపూర్‌లోని మోరే మయన్మార్‌కు కూడా సమీపంలో ఉండటం, అక్కడి నుంచి వివిధ తెగల వా రు అక్రమంగా వలస రావడం వంటి సంక్లిష్టతల పై కూడా అమిత్ షా దృష్టి సారించారు. అమిత్ షా గురువారం కూడా మణిపూర్‌లోనే ఉంటారు. రాష్ట్రంలో త్వరితగతిన సాధారణ పరిస్థితులు ఏ ర్పడాలని వివిధ వర్గాలు ఆశిస్తున్నారని, పలు వ ర్గాలకు చెందిన వారితో మాట్లాడినప్పుడు సృహద్భావ సంకేతాలు వెలువడ్డాయని హోం మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఒక్కరుఉ తెలిపారు. మణిపూర్ పోలీసు, కేంద్రీయ సాయుధ పోలీసు బలగాలు (సిఎపిఎఫ్), సైన్యంతో కూడా మూడురోజులుగా అమిత్ షా విస్తృత చర్యలు సాగుతున్నాయి.

ఆదివారం మణిపూర్‌లో వేర్పాటువాదు లు మారణాయుధాలతో దాడులకు దిగడం, వీరి ని అణచివేసేందుకు భద్రతా బలగాలు పెద్ద ఎత్తు న గాలింపు చర్యలు చేపట్టడం, పలు చోట్ల ఎన్‌కౌంటర్లు జరగడం ఈ క్రమంలో దాదాపు 50 మంది వరకూ ఉగ్రవాదులు మృతి చెందడం వం టి పరిణామాలు తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ఎస్‌టి కోటా విషయంపై కుకీలు, మై తీల మధ్య నెలకొన్న వివాదం చల్లారే దశలోనే ఉన్నట్లుండి వేర్పాటువాద శక్తులు విజృంభించడం తో శాంతిభద్రతల పరిరక్షణ ఇప్పుడు భద్రతా బలగాలకు సవాలు అయింది.తెగల మధ్య ఘర్షణలు ము ప్పును తెచ్చిపెడుతాయని భావించి కేంద్ర హోం మంత్రి ఇక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు, సమీక్షించేందుకు మణిపూర్‌కు వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News