Saturday, November 16, 2024

కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: కెసిఆర్, ఓవైసితో బిజెపి కలిసే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. బిజెపి… ఒవైసితో పాటు వెళ్తుందా? మీరే చెప్పండి అని ప్రశ్నించారు. ఖమ్మం వేదికగా బిజెపి ఎన్నికల శంఖారావం పూరించింది. రైతు గోస-బిజెపి భరోసా పేరిట జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. ఒవైసితో బిజెపి కనీసం వేదికను కూడా పంచుకునే ప్రసక్తే లేదన్నారు. రైతు, దళిత, మహిళ వ్యతిరేకమైన కెసిఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సాగనంపాలని పిలుపునిచ్చారు. సోనియా కుటుంబం కోసం కాంగ్రెస్ పని చేస్తుందని, కల్వకుంట్ల కుటుంబం కోసం బిఆర్‌ఎస్ పని చేస్తుందని, కెసిఆర్ ప్రభుత్వానికి తిరోగమనం ప్రారంభమైందని, కెసిఆర్ పాలనకు నూకలు చెల్లాయన్నారు. తెలంగాణ విమోచన వీరులను సిఎం కెసిఆర్ అవమానిస్తున్నారని, తెలంగాణ అమర వీరుల కలలను కెసిఆర్ కల్లలు చేశారని అమిత్ షా ధ్వజమెత్తారు.

Also Read: కారుతో డాక్టర్ ను ఢీకొట్టి… బానెట్‌పై 50 మీటర్లు లాక్కెళ్లి (వీడియో వైరల్ )

తెలంగాణలో త్వరలో కమలం వికిసిస్తుందని జోస్యం చెప్పారు. కెసిఆర్ కారు భద్రాచలం వెళ్తుందని,… కానీ ఆలయం వరకూ వెళ్లందని చురకలంటించారు. కెసిఆర్ కారు స్టీరింగ్ ఎంఐఎం నేత ఒవైసి చేతిల్లో ఉందని విమర్శించారు. ఎంఐఎం చేతిలో స్టీరింగ్ ఉన్న కారు మనకు కావాలా? అని అడిగారు. బిజెపి నేతలు కిషన్ రెడ్డి, బండి, ఈటెలను అరెస్టులతో భయపెట్టాలని కెసిఆర్ చూస్తున్నారని, ఈ సారి సిఎం అయ్యేది కెసిఆర్ కాదు, కెటిఆర్ కాదని, బిజెపి నేత సిఎం అవుతారని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ 4 జి పార్టీ, బిఆర్‌ఎస్ 2జీ పార్టీ, ఎంఐఎం 3జి పార్టీ అని చురకలంటించారు. తెలంగాణ అధికారంలోకి వచ్చేది పిఎం మోడీ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, కెసిఆర్ ధాన్యం కొనుగోలుపై రాజకీయాలు చేస్తున్నారని, మోడీ సర్కారు ఇప్పటివరకు తొమ్మిది లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. కెసిఆర్, బిజెపి ఏకమవుతున్నాయని ఎఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అబద్ధాలు చెబుతున్నారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News