Thursday, January 23, 2025

రాహుల్‌కు అమిత్‌షా సలహా

- Advertisement -
- Advertisement -

పటాన్ (గుజరాత్): విదేశాలకు వెళ్లి స్వదేశాన్ని విమర్శించడం ఏ రాజకీయ నేతకూ తగదని, దేశభక్తుడైన ఏ వ్యక్తి అయినా, దేశ రాజకీయాలు తన దేశం లోనే మాట్లాడాలి తప్ప విదేశాలకు వెళ్లి విమర్శించడం ఏ పార్టీ నాయకుడికి తగదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హితవు పలికారు. ఈ విషయాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గుర్తుంచుకోవాలన్నారు. వేసవి వేడిని తప్పించుకోడానికి సెలవులను గడిపేందుకు రాహుల్ విదేశాలకు వెళ్తున్నారని , విదేశాల్లో మన దేశాన్ని కించపరుస్తున్నారని విమర్శించారు. మీ పూర్వీకుల నుంచి నేర్చుకోండి” అని రాహుల్‌కు సలహా ఇచ్చారు.

తొమ్మిదేళ్ల మోడీ పాలన పూర్తయిన సందర్భంగా గుజరాత్ లోని పటాన్ జిల్లా సిధ్ధ్‌పూర్ పట్టణంలో శనివారం ర్యాలీ సందర్భంగా అమిత్‌షా మాట్లాడారు. పార్లమెంట్‌లో చారిత్రక రాజదండం గురించి ప్రస్తావిస్తూ ఆనాడు మాజీ ప్రధాని జవహర్‌లాల్ దాన్ని ప్రతిష్టించాలని అనుకున్నారని, కానీ ఆయన చేయలేని పనిని ప్రధాని మోడీ ఇప్పుడు చేస్తే ఎందుకు మీరు వ్యతిరేకిస్తారు ? అని రాహుల్‌ను ప్రశించారు. అయోధ్యలో రామాలయం, ఆర్టికల్ 370 రద్దు, అంశాలపై రాహుల్ విమర్శలను ప్రస్తావించారు. మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా హయాంలో పాలనను మోడీ పాలనతో పోల్చి చెబుతూ మోడీ పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందీ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News