- Advertisement -
హైదరాబాద్: ఆర్టికల్ 370 రద్దులో ప్రధాని మోడీతో పాటుగా కీలక పాత్ర పోషించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.‘ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పేదలు, అణగారిన వర్గాల హక్కుల పునరుద్ధరణ జరుగుతుంది. వేర్పాటువాదం, రాళ్లు రువ్వే ఘటనలు ఇక గతమే. జమ్మూ కశ్మీర్, లడఖ్‌ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.స్థానిక ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడం,అత్యాధునిక విద్యా మౌలిక వసతులను కల్పించడం,పేదలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం’ అని అమిత్ షా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయన తన ట్వీట్‌కు నయా జమ్మూ కశ్మీర్ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.
- Advertisement -