Tuesday, April 1, 2025

7 లక్షల ఓట్ల మెజార్టీతో అమిత్‌షా అఖండ విజయం

- Advertisement -
- Advertisement -

గుజరాత్ లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి తిరిగి పోటీ చేసిన సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మంత్రి అమిత్‌షా, తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ పటేల్ పై 7 లక్షల ఓట్ల మెజార్టీతో అఖండ విజయం సాధించారు. అమిత్‌షాకు మొత్తం 10, 10, 972 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి పటేల్‌కు 2,66,256 ఓట్లు వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే గాంధీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అమిత్‌షాకు 5.57 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఒకప్పుడు బీజేపీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ గాంధీనగర్ నుంచే పోటీ చేసేవారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News