Wednesday, January 22, 2025

అమిత్ షా సభ ఏర్పాట్ల పరిలించిన బిజెపి నేతలు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : నగరంలో ఈనెల15న జరిగే అమిత్ షా బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను భారతీయ జనతా పార్టీ తెలంగాణ సహ ఇంచార్జ్ మాజీ ఎం ఎల్ సి పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి మాజీ మంత్రి రవీందర్ నాయక్ ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ కడగంచి రమేష్, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, ఇతర రాష్ట్ర నాయకులు పరిశీలించారు.ఈ సందర్భంగా నిర్వహకులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడ్తూ అమిత్ షా సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు సమీపంలో ఉన్న సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి దాదాపు లక్ష మంది తరలి వస్తారని అంచనావేస్తున్నామన్నారు. అమిత్ షా హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా ముందుకు భద్రాచలంకు చేరుకొని అక్కడ శ్రీరాముడిని సందర్శిస్తారు.అనంతరం సాయంత్రం ఖమ్మంకు చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారని వారు తెలిపారు.

బిజెపి ఖమ్మం జిల్లా కార్యాలయంలో అమిత్ షా సభ సందర్భంగా తరలివచ్చే నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా, పది డిపార్ట్మెంట్ల వారీగా ఇంచార్జ్‌లను నియమించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి పర్మీషన్ల కొరకు బిజెపి రాష్ట్ర నాయకులు గంటేల విద్యాసాగర్, వాహనాల పార్కింగ్ వ్యవహారాలను మాజీ జిల్లా అధ్యక్షులు సన్నే ఉదయ ప్రతాప్, రాష్ట్ర నాయకులను రిసీవింగ్ చేసుకొనుటకు ఉప్పల శారద, కొలిపాక శ్రీదేవి, హెలిప్యాండ్ లాండింగ్ ఏర్పాట్ల కొరకు దేవకి వాసుదేవరావుని, శ్యామ్ రాథోడ్‌ని, వేధిక వద్ద రుద్ర ప్రదీప్ పోలీస్ కోఆర్డినేషన్ కొరకు నున్న రవికుమార్‌ని, జిల్లా కార్యాలయం నుంచి మానిటరింగ్ చేయుట కొరకు జిల్లా ఉపాధ్యక్షురాలు మందా సరస్వతి ని, జిల్లా అధికార ప్రతినిధి అత్తి విజయ రెడ్డి ని, మీటింగ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు చేయుటకు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావా కిరణ్, గ్రౌండ్లో వాలంటరీలతో కలిసి ఏర్పాట్లను చూడవలసిందిగా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు అనంత ఉపేంద్ర గౌడ్ ని, వీఐపీ పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయుట కొరకు వీరు గౌడ్, ఈదుల వీరభద్రం వీఐపీలను రిసీవ్ చేసుకోవాల్సిందిగా కనమర్లపూడి ఉపేందర్ నియమించారు

ఖమ్మంలో ఈనెల 15న శ్రీరామ భక్త గెంటాల నారాయణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నిర్వహిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభను జయప్రదం చేయాలని బిజెపి మహిళా మోర్చా అధ్యక్షులు దొడ్డ అరుణ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో పలుచోట్ల ప్రచారం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ రకాల పథకాలను వివరించారు. కేంద్ర రాష్ట్రం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వమే ప్రవేశపెట్టినట్టుగా చూపిస్తూ పబ్బం గడుపుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పాలసీ రీసెర్చ్ జాతీయ నాయకురాలు పరిమిత, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఉప్పల శారద, మహిళా మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ రేణుక ముదిరాజ్, నిర్మల్ జిల్లా మహిళా మోర్చా ఇన్చార్జి గీతా రామ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు శకుంతల, భాగ్యనగర్ జిల్లా అధ్యక్షురాలు దశరథ్ లక్ష్మి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కరుణ యాదవ్, ఖమ్మం జిల్లా మహిళా మోర్చా ఇన్చార్జి విజయలక్ష్మి, మహంకాళి జిల్లా ఫోర్స్ పర్సన్ శారదా మల్లేష్, మహంకాళి జిల్లా జిఎస్ అనిత, భారతీయ జనతా పార్టీ మహిళ ఉపాధ్యక్షురాలు మంద సరస్వతి తదితరులు టేకులపల్లి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ప్రత్యేక పూజలు చేసి ఏదో డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ ప్రచారాన్ని ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News