Sunday, January 19, 2025

అదో ఔరంగ్ జేబ్ ఫ్యాన్ క్లబ్: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి(ఎంవిఏ)ని ‘ఔరంగ్ జేబ్ ఫ్యాన్ క్లబ్’ అని కేంద్ర మంత్రి  అమిత్ షా వ్యాఖ్యానించారు. అంతేకాక వీర్ సావర్కర్, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరేను దమ్ముంటే ప్రశంసించాలని రాహుల్ గాంధీకి సవాలు విసిరారు. ‘‘ఉద్ధవ్ గారు, ఒకవేళ మీకు దమ్ముంటే వీర్ సావర్కర్, బాలాసాహెబ్ మీద రెండు మంచి మాటలు రాహులు గాంధీతో అనిపించండి’’ అన్నారు. మహారాష్ట్రలోని హింగోలిలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. నవంబర్ 20 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు ఆయన ఈ విషయం చెప్పారు.

‘‘రాహుల్ బాబా కాంగ్రెస్ పార్టీ కశ్మీర్ లో 370 ఆర్టికల్ తిరిగి తీసుకొస్తామని తీర్మానం చేసింది. జాగ్రత్తగా విను, నువ్వే కాదు…నీ నాలుగో తరం కూడా తీసుకురాలేదు’’ అని షా తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News