Saturday, December 21, 2024

ఛత్తీస్‌గఢ్ లో నక్సలిజంపై అమిత్ షా సమావేశం

- Advertisement -
- Advertisement -

రాయిపూర్: నక్సలిజంపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన అంతర్‌రాష్ట్ర సమన్వయ సమావేశం శనివారం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయిపూర్‌లో మొదలైంది. ఐదు రాష్ట్రాల సీనియర్ అధికారులు హాజరవుతున్న ఈ సమావేశం రాష్ట్రాల మధ్య సమన్వయం, వామపక్ష తీవ్రవాద పరిస్థితిని సమీక్షిస్తుంది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా, మధ్య ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, పోలీస్ డైరెక్టర్ జనరల్ (డిజిపి)లు సమావేశానికి హాజరవుతున్నారని అధికారి ఒకరు తెలియజేశారు.

‘కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా పాల్గొంటున్నారు. ఆ ఏడు రాష్ట్రాల్లో, ముఖ్యంగా అంతర్‌రాష్ట్ర సరిహద్దుల్లో నక్సలైట్ల ఉనికి ఉన్నది. ఈ సమావేశం అనంతరం అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌లో వామపక్ష తీవ్రవాద బాధిత ప్రాంతాల భద్రత, అభివృద్ధిపై సమావేశానికి అధ్యక్షత వహిస్తారు’ అని అధికారి తెలిపారు. నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వచ్చిన దరిమిలా ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల వ్యతిరేక కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఈ ఏడాది ఇంత వరకు 142 మంది నక్సలైట్లను భద్రత బలగాలు హతమార్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News