Sunday, February 23, 2025

అమిత్ షా భద్రతా లోపం…ఓ మోసగాడు అరెస్టు

- Advertisement -
- Advertisement -
Amit Shah's security breach
హోం మంత్రిత్వ శాఖ స్టాఫర్‌గా నటించిన నేరగాడి అరెస్టు

ముంబై:  కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవలి మహారాష్ట్ర పర్యటనలో పెద్ద భద్రతా ఉల్లంఘన జరిగింది. మంత్రి రెండు రోజుల ముంబై పర్యటన సందర్భంగా హోంమంత్రి అమిత్ షా భద్రతను ఉల్లంఘించారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని ధూలేకు చెందిన వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.  హేమంత్ బన్సీలాల్ పవార్(32 ) అనే ఆ నిందితుడు షాతో పాటు ఇతర రాజకీయ నాయకులతో కలిసిమెలిసి పోయిన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు హేమంత్ పవార్‌ను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

“పవార్‌పై పబ్లిక్ సర్వెంట్‌గా వ్యవహరించినందుకు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 170 మరియు ఐపిసి సెక్షన్ 171 కింద కేసు నమోదు చేయబడింది” అని విచారణ అధికారి తెలిపారు. పవార్‌ను మలబార్ హిల్ పోలీస్ స్టేషన్ సోమవారం అరెస్టు చేసిన తర్వాత బుధవారం గిర్గామ్‌లోని 40వ కోర్టు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News