Tuesday, January 28, 2025

రతన్ టాటా గురించి అమితాబ్ బచ్చన్ ఏమన్నారు?

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అక్టోబర్ 9న కాలధర్మం చేశారు. అయితే ఇటీవల మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా క్రోర్ పతి-16’లో ఆయన గురించి గుర్తుచేసుకున్నారు. ‘ఆయన ఎంతటి మహనీయుడన్నది నా మాటల్లో చెప్పలేను’(క్యా ఆద్మీ తా మై బతా నహీ సక్తా) అన్నారు. ఆయన లేటెస్ట్ ప్రమోషో లో బొమన్ ఈరానీ, ఫర్హా ఖాన్ కనిపించనున్నారు.

‘‘నేనో సారి లండన్ కు రతన్ టాటాతో కలిసి వెళ్లాను. ఆ సమయంలో ఆయన ఫోన్ చేయడానికి సైతం నన్ను డబ్బు అడిగారు. హిత్రో విమానాశ్రయంలో దిగినప్పుడు ఆయనను పికప్ చేసుకునేవారు వెళ్లిపోవడం జరిగింది. తర్వాత ఆయన కాల్ చేయడానికి ఓ బూత్ కు వెళ్లారు. తర్వాత కాసేపటికి ఆయన నా దగ్గరికి వచ్చి ‘‘అమితాబ్, నీ నుంచి నాకు కొంత డబ్బు అవసరం, నేను ఓ ఫోన్ కాల్ చేసుకోవాల్సి ఉంది’’ అన్నారు. ఆయన నైజం నన్ను కదిలించివేసింది. ఓ నటుడిగా ఆయన జ్ఞాపకం నేనెన్నటికీ మరచిపోలేను’’ అన్నారు.

అమితాబ్ బచ్చన్ ఇంకో జ్ఞాపకాన్ని కూడా పంచుకున్నారు.  రతన్ టాటా ఓసారి నాతో ‘‘ఫ్రెండ్, నన్ను నా ఇంటి దగ్గర దించుతావా? నేను నీ ఇంటి దగ్గిరే ఉంటాను. నాకు కారు లేదు’’ అన్నారు. ‘‘ఇది మీరూహించగలరా? నమ్మలేరు కూడా’’ అని అమితాబ్ బచ్చన్ గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా మరణంపై అమితాబ్ బచ్చన్ ‘ఎక్స్’ లో తన సంతాపాన్ని కూడా ప్రకటించారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News