Thursday, January 23, 2025

ఆస్పత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అస్వస్థత కారణంగా ఆయన శుక్రవారం ఉదయం  ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. అమితాబ్ కాలిపై రక్తం గడ్డ కట్టుకోవడంతో ఆంజియోప్లాస్టీ నిర్వహించినట్లు ఒక ప్రముఖ ఆంగ్ల వార్తాపత్రిక పేర్కొంది. అమితాబ్ అనారోగ్యంపై అధికారికంగా ఎవరూ ధ్రువీకరించటం లేదు. ఇదిలాఉండగా బిగ్ బీ ఆస్పత్రిలో చేరడానికి కొన్ని గంటల ముందు ఎక్స్ లో చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆయన “ఎప్పటికీ కృతజ్ఞతలతో…” అని మాత్రమే పోస్ట్ చేయడం గమనార్హం. తన అనారోగ్యానికి సంబంధించి అమితాబ్ ఇలా కామెంట్ చేశారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News