Monday, January 20, 2025

బిగ్‌బి అమితాబ్ @ 81

- Advertisement -
- Advertisement -

ముంబై : బిగ్ బి అమితాబ్ బచ్చన్ 81వ జన్మదినం బుధవారం ఇక్కడ ఘనమైన రీతిలో జరిగింది. ఇప్పటికీ హిట్‌లతో సాగుతున్న ఈ హీరోకు శుభాకాంక్షలు తెలియ చేసేందుకు ముంబైలోని జుహూ ప్రాంతంలోని అమితాబ్ నివాసం జల్సా వద్దకు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. తనకోసం వచ్చిన వారి కోసం అమితాబ్ అర్థరాత్రి దాటినతరువాత బయటకు వచ్చారు. వారివైపు అభివాదం చేశారు. గులాబీ, నల్లటి రంగు ట్రాక్‌సూట్‌లో ఉన్న అమితాబ్‌ను చూడగానే అభిమానులు కేరింతలకు దిగారు.

వారికి అమితాబ్ చేతులు జోడించి నమస్కారం పెట్టారు. అమితాబ్ వెంబడిద్వారం వద్ద కోడలు ఐశ్వర్యా బచ్చన్, మనవరాళ్లు ఆరాధ్య, నవ్య నవెలి నందా నిలిచారు. ఆ తరువాత అమితాబ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ మీ ఆశీస్సులు, నా అదృష్టం అని తెలిపారు. ఆ తరువాత తెల్లవారుజామున అమితాబ్‌బచ్చన్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక దేవాలయానికి వెళ్లి పూజాదికాలు నిర్వహించారు. వచ్చే దారిలో అంతటా జనం అమితాబ్‌ను చూసేందుకు బారులు తీరారు. ఎందరో ఆయనను చూస్తూ బిగ్‌బి అంటూ హర్షధ్వానాలు చేశారు.

అలుపెరుగని అమితాబ్ కల్కి అవతారం
వయస్సుతో పనేముందంటూ అమితాబ్ బచ్చన్ ఇప్పటికి నటుడిగా సాగుతున్న నేపథ్యంలో ఆయన జన్మదినం నేపథ్యంలో కొత్త చిత్రం కల్కి 2898 ఎడి సినిమా పోస్టరు వెలువడింది. ఈ భారీ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది. ఇంతకు ముందెప్పుడూ కన్పించని రీతిలో సరికొత్తగా కల్కి గెటప్‌లో అమితాబ్ కన్పించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ గుహ అందులో నుంచి కల్కి రావడం ఈ పోస్టరులో చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News