Monday, December 23, 2024

కూతురికి బిగ్ బీ సూపర్ గిఫ్ట్!

- Advertisement -
- Advertisement -

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన కుమార్తెకు సూపర్ గిఫ్ట్ ఇచ్చారు. జుహూలో తాను కొన్ని దశాబ్దాలపాటు నివసించిన ఇంటిని కుమార్తె శ్వేత నందాకు బహుమతిగా ఇచ్చారు. ఈ బంగ్లా పేరు ప్రతీక్ష. విలాసవంతమైన ఈ భవనం విలువ 50 కోట్లకు పైమాటే. అమితాబ్ 50 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీ చెల్లించి, ఈ భవనాన్ని కుమార్తె పేరిట రిజిష్టర్ చేయించారట. అమితాబ్ చాలా ఏళ్లు ఇదే బంగ్లాలో నివసించారు. ఆ తర్వాత జల్సా అనే మరో బంగ్లాలోకి మకాం మార్చారు. అమితాబ్ కు జుహూలోనే ప్రతీక్ష, జల్సా కాకుండా జనక్ అనే మరో బంగ్లా కూడా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News