Monday, January 20, 2025

‘ప్రాజెక్ట్ కె’ సెట్‌లో అమితాబ్ బచ్చన్‌కు గాయం!

- Advertisement -
- Advertisement -

పక్కటెముక మృదులాస్థి విరిగింది

హైదరాబాద్: రాబోయే చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ కోసం యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు నటుడు అమితాబ్ బచ్చన్ తీవ్రంగా గాయపడ్డారు. 80 ఏళ్ల ఈ సూపర్ స్టార్ తాత్కాలికంగా అన్ని పనులను నిలిపివేశారు. ప్రస్తుతం బెడ్ రెస్ట్‌లో ఉన్న ఆయన ముంబైలోని తన ఇంటికి తిరిగి వెళ్లాడు.

‘…ఒక యాక్షన్ షాట్ సమయంలో నేను గాయపడ్డాను. పక్కటెముక మృదులాస్థి విరిగింది. కుడి పక్కటెముక కండరాలు చిరిగిపోయాయి’ అని ఆయన తన బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్నారు. ముంబైకి తరలించే ముందు హైదరాబాద్‌లోని ఏఐజి హాస్పిటల్స్ సీటీ స్కాన్ చేయించుకున్నట్లు అమితాబ్ బచ్చన్ తెలిపారు.

“పట్టీ వేయడం జరిగింది, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అవును, ఊపిరి తీస్తున్నప్పుడు, కదులుతున్నప్పుడు బాధాకరంగా ఉంది. కోలుకోడానికి కొంత సమయం పడుతుంది. నొప్పికి కొన్ని మందులు వాడుతున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.

అతను తన ఇల్లు ‘జల్సా’లో విశ్రాంతి తీసుకుంటున్నందున అన్ని కార్యాకలాపాలకు కొంచెం దూరం’ అని పేర్కొన్నారు. ఆదివారం తన ‘మీట్ అండ్ గ్రీట్’ కోసం తన అభిమానులను తన బంగ్లా వెలుపల కలవలేనని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News