Monday, December 23, 2024

‘రాధే శ్యామ్’కు బిగ్‌బి వాయిస్ ఓవర్

- Advertisement -
- Advertisement -

Amitabh bachchan provided voice over for Radhe Shyam

 

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ బడ్జెట్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’. 1970ల్లో జరిగే అందమైన ప్రేమ కథ ఇది. ఇటలీ, హైదరాబాద్‌లోని అద్భుతమైన లొకేషన్స్‌తో పాటు కోట్లాది రూపాయల అత్యద్భుతమైన సెట్స్‌లో పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులు రెండు చోట్లా సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమా పాటలు, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు నెరేటర్‌గా మారిపోయారు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్. రాధే శ్యామ్ సినిమాకు ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమాకు అమితాబ్ నెరేషన్ అదనపు ఆకర్షణ అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రం మార్చి 11న విడుదల కానుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News