Monday, December 23, 2024

ఈ ఫోటో వెనక పెద్ద కథే ఉంది!

- Advertisement -
- Advertisement -

అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన కుమారుడు అభిషేక్ తో కలసి హాజరయ్యారు. అయితే ఆయన అయోధ్యకు బయల్దేరేముందు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఫోటోలో చాలామంది బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. అమితాబ్ మైక్ లో మాట్లాడుతుండగా, షమ్మీ కపూర్, రేఖ, మహమూద్,  రణధీర్ కపూర్, రాజ్ కపూర్, మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణ్ జీ, వినోద్ ఖన్నా తదితరులు వేదికపై ఉన్నారు. ఫోటోను పోస్ట్ చేసిన అమితాబ్ … ‘ఈ ఫోటో వెనక చాలా పెద్ద కథే ఉంది… సమయం వచ్చినప్పుడు చెబుతా’ అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు నెటిజన్లు ఈ ఫోటో వెనక ఏం కథ ఉండి ఉంటుందని ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఇదిలాఉంటే అయోధ్యలో అమితాబ్ తనకు ఎదురుపడిన కొందరు ప్రముఖులతో ముచ్చటిస్తూ కనిపించారు. నటుడు అరుణ్ గోవిల్ తో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. టెలివిజన్ లో ఒకప్పుడు అభిమానులను ఉర్రూతలూగించిన ‘రామాయణ్’ సీరియల్ లో రాముడిగా అరుణ్ గోవిల్ నటించారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ రవిశంకర్ మిశ్రాతోను, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీతోనూ అమితాబ్ కాసేపు మాట్లాడారు.

బిగ్ బీ తాజా చిత్రాల విషయానికొస్తే, ప్రభాస్ నటిస్తున్న కల్కి 2989 ఏడి మూవీలో ఆయన ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో దీపిక పడుకొనే కూడా నటిస్తున్నారు. నాగ్  అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి మూవీని మే9న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అమితాబ్ సెక్షన్ 84 అనే మూవీలోనూ నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News