Thursday, December 26, 2024

దశరథుడిగా అమితాబ్ బచ్చన్?

- Advertisement -
- Advertisement -

దర్శకుడు నితేశ్ తివారీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రామాయణ్ మూవీ నిర్మాణం ప్రారంభం కాకముందే సంచలనాలు సృష్టిస్తోంది. 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని భారీ తారాగణంతో రూపొందిస్తున్నారు. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్న రామాయణ్ మూవీలో రావణాసురుడి పాత్రకు కన్నడ సూపర్ స్టార్, కేజీఎఫ్ ఫేమ్ యశ్ ను ఎంపిక చేశారు. దశరథుడిగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారనేది తాజా వార్త. అమితాబ్ ఓకే చెప్పారో లేదో తెలియదు గానీ బాలీవుడ్ లో మాత్రం ఈ వార్త ట్రెండ్ అవుతోంది.

శూర్పణఖ పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు రకుల్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. జాకీ భగ్నానీని వివాహం చేసుకుంటున్న రకుల్, ఏర్పాట్లలో బిజీగా ఉంది. వివాహం తర్వాత ఆమె షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. రామాయణ్ మూవీని 2025లో రిలీజ్ చేయాలన్నది నితేశ్ ప్లాన్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News