Friday, April 25, 2025

అమితాబ్‌కు యాంజియో ప్లాస్టీ ఆపరేషన్

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో శుక్రవారం నగరంలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో చేరారు. యాంజియో ప్లాస్టీ సర్జరీ కోసం 81 ఏళ్ల ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత అమితాబ్ రాత్రి తిరిగి ఇంటికి చేరుకున్నారు. కాలిలో రక్తం గడ్డ కట్టడంతో దాన్ని తొలగించడం కోసం యాంజియో ప్లాస్టీ ఆపరేషన్ చేసినట్లు వైద్యులు తెలిపారు. దాన్ని తొలగించని పక్షంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉన్నందున సర్జరీ చేసి తొలగించినట్లు వారు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బిగ్ బి అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News