Thursday, January 9, 2025

నిర్మాత అశ్వనీ దత్ కు అమితాబ్ అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతీయ సినీ జగత్తులో అమితాబ్ బచ్చన్ ఓ అసామాన్య నటుడు. ఆయన గురించి ఎంత చెప్పిన తక్కువే. కానీ ఆయన స్వయంగా తెలుగు నిర్మాతకు అరుదైన గౌరవం ఇవ్వడం అవ్వాక్కయ్యేలా చేస్తోంది. ఇటీవల నటుడు ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఆ సందర్భంలో అమితాబ్ బచ్చన్ ఒంగి అశ్వీనీ దత్ ఆశీస్సులు తీసుకునే ప్రయత్నం చేశారు. అది అశ్వనీ దత్ జీవితంలో గుర్తుండిపోయే ఘట్టం.

వేదిక మీద అమితాబ్ బచ్చన్ నిర్మాత అశ్వనీ దత్ గురించి చెబుతూ తన కెరీర్ లో ఇలాంటి వినయపూర్వకమైన వ్యక్తిని చూడలేదంటూ అశ్వనీ దత్ ను కొనియాడారు. 50 ఏళ్లుగా నిర్మాతగా రాణిస్తున్నారంటూ బాలీవుడ్ మీడియాకు గొప్పగా తెలిపారు. అంతేకాదు అశ్వనీ దత్ పాదాలు తాకి ఆశీస్సు తీసుకునే ప్రయత్నం చేశారు. దీనిపై అశ్వనీ దత్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

అమితాబ్ ఓ లెజెండ్ అని, ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం వ్యక్తి అని, ఆయనకు సెల్యూట్ చేస్తున్నానంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

‘కల్కి’ ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇది నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, రాజేంద్ర ప్రసాద్, దిశా పటానీ తదితరులు నటించారు. ఈ సినిమా జూన్ 27న థియేటర్లలోకి రాబోతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News