Thursday, December 19, 2024

కూటమిని గెలిపిస్తే సీమలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రథమ స్థానంలో నిలిపారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. విభజిత ఎపిని కూడా చంద్రబాబు ప్రగతి ప్రథంలో నిలిపారని ప్రశంసించారు. చంద్రబాబు చేపట్టిన అభివృద్ధిని జగన్ అధోగతి పట్టించారని ధ్వజమెత్తారు. హిందూపురం లోక్ సభ పరిధిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మద్య నిషేధం చేస్తానని జగన్ హామీ ఇచ్చి మాట తప్పారని, మద్య నిషేధం చేయకపోగా మద్యం సిండికేట్‌కు తెరలేపారని, అట్టహాసంగా ఆరోగ్యశ్రీ ప్రకటించి నిధులివ్వకుండా నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు, మోడీ గెలిపిస్తే సీమలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని షా హామీ ఇచ్చారు. 25 కు 25 ఎంపి స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. అసెంబ్లీలో మూడింట రెండొంతల సీట్లు ఇచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News