ఆవిష్కరించిన బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్
పార్టీ అధినేతను కలిసి నూతన సంవత్సర
శుభాకాంక్షలు తెలిపిన నేతలు
మన తెలంగాణ/హైదరాబాద్ : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పలువురు బిఆర్‌ఎస్ నేతలు, జీ మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, మాజీ ఎంఎల్‌ఎలు, ప్రజా ప్రతినిధులు శనివారం బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, రచయిత జూలూరు గౌరీ శంకర్ తెలంగాణ తల్లి పై రాసిన ‘అందరికీ అమ్మ’ పుస్తకాన్ని కెసిఆర్ ఆవిష్కరించారు.
కెసిఆర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు, ఎంఎల్‌ఎలు జి. జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఎల్‌సిలు తాతా మధు, ఎంసి కోటిరెడ్డి, జెడ్‌పి చైర్మన్లు బండ నరేందర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎంఎల్‌ఎలు కంచర్ల భూపాల్ రెడ్డి, రమావత్ రవీంద్ర కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, గొంగిడి సునితా మహేందర్ రెడ్డి, గ్యాదరి కిషోర్ కుమార్, కందాల ఉపేందర్ రెడ్డి, నల్లమోతు భాస్కర రావు,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, పలువురు బిఆర్‌ఎస్ నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, నర్సింహా రెడ్డి, పాల్వాయి స్రవంతి, రేగట్టే మల్లిగార్జున్ రెడ్డి, మందడి సైదిరెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి, పల్లె ప్రవీణ్ రెడ్డి, నేవూరి ధర్మేందర్ రెడ్డి, వలమల కృష్ణ, నూకల యుగంధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.