Saturday, November 16, 2024

అమ్మా నీకు ‘బోనమే తల్లీ’

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింభించే రాష్ట్ర పండుగ, బోనాల జాతరకు సర్వం సిద్ధమైయ్యింది. గ్రేటర్ వ్యాప్తంగా ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసి పలు అభివృద్ధి పనులను చేపట్టింది. అంతేకాకుండా గ్రేటర్ పరిధిలోని అన్ని దేవాలయాలకు ప్రత్యేకంగా చెక్కులను పంపిణీ చేసింది. దీనిలో భాగంగానే బోనాల పండగను పాతననగరంలో ఘనంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో అమ్మవారి ఆలయాలకు రూ. 15 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మం జూరు చేశారు.

దీంతో పాతబస్తీలోని 209 దేవాలయాలకు కోటి 40 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జీహెచ్‌ఎంసి చార్మినార్ జోన్ పరిధిలో సుమారు పది కోట్ల పది లక్షల రూపాయలతో 265 పనులు చేపట్టారు. పాతనగర ప్రజలు అమ్మవారి పండుగను ద్విగుణీకృత ఉత్సాహం, భక్తిశ్రద్ధలతో జరుపుకునేందుకు విస్తృత ఏర్పాట్లు చేసుకున్నారు. బోనాల జాతర అంగరంగ వైభవంగా జరపుకోనేందుకు తమ బంధువులను, ఇంటి ఆడపడచులను, స్నేహితులను ఆహ్వానించారు. ఉత్సవాలలో పదవ రోజైన ఆదివారం తెల్లవారు జామున అమ్మవారికి బలిహరణం, దేవీ అభిషేకానంతరం బోనాల సమర్పణ ప్రారంభమవుతుంది.

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిణి మహంకాళి దేవాల యం, హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం, కోవబేలా శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం, రాంబక్షిబండ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం, బేలా చందూలాల్ శ్రీ మాతేశ్వరి ముత్యాలమ్మ దేవాలయం, గౌలిపురా శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత, కోటమైసమ్మ దేవాలయం, సుల్తాన్‌షాహి శ్రీ జగదాంబ దేవాలయం, ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం, అలియాబాద్ శ్రీ దర్బార్ మైసమ్మ దేవాలయం, చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయం, మీర్‌ఆలం మండి శ్రీ మ హంకాళేశ్వర దేవాలయం, చాంద్రాయణగుట్ట కుమ్మర్‌వాడి శ్రీ కనక దుర్గ దేవాలయం, హరిజనబస్తీ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, చాంద్రాయణగుట్ట చౌరస్తాలోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం తదితర ప్రాంతాలలోని ఆలయాలను రంగు రంగుల విద్యుత్ దీపాలు, రకరకాల పూలు, వేప ఆకులు, మామిడి ఆకులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

దారి పొడవున కళ్లు మిరుమిట్లు గొల్పే విద్యుళ్ళతలతో కూడిన భారీ దేవతా మూర్తుల డిజిటల్ ఎల్‌ఈడీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. పండగను పురస్కరించుకొని అధికార, అనధికార ప్రముఖులతోపాటు వివిధ పార్టీల రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. తీన్మార్ జానపద గీ తాలు, బ్యాండు మేతలు, పోతరాజుల వీరంగం, యువకుల కే రింతలతో పాతబస్తీలో బోనాల శోభను ఉట్టి పడుతుంది. కాగా రాత్రి 8గంటలకు వేద పండితుల మంత్రాచ్ఛారణల మధ్య ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ అమ్మవారికి శాంతి కల్యాణం నిర్వహిస్తారు.

బోనాల పండగలో బోనం ప్రధానమైయ్యింది. సాంప్రదాయ మట్టికుండను సున్నం, పసుపు, కుంకుమ, వేపాకులతో అందంగా అలంకరించి అం దులో అన్నం పెట్టి, దానిపై మరో చిన్న కుండను ఏర్పాటు చేసి ఆపై గండ దీపం, అగర్బత్తీలు వెలిగిస్తారు. ఇంట్లోని పెద్దవారు బోనానికి పసుపు నీళ్లు, వేపాకులతో సాకపెడతారు. అనంతరం ఇంటి ఇలవేల్పు ముందు బోనాన్ని ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులంతా పూజలు చేసి భక్తిప్రపత్తులతో ప్రణమిల్లుతారు. ఆ తరువాత బ్యాండు, డప్పు వాయిద్యాలతో పోతరాజు చిందులేస్తుండగా అందంగా, సాంప్రదాయదుస్థులతో అలంకరించుకున్న మతైదువలు, యువతులు, బాలికలు బోనం తలపై ఎత్తుకున్న ముందు నడువగా కు టుంబ సభ్యులంతా ఆమెను అనుసరిస్తూ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ మాతేశ్వరి మహంకాళికి పూజలు చేసి బోనం సమర్పిస్తారు. తమ కుంటబా న్ని ఆయురారోగ్యాలతో, సుఖః సంతోషాలతో, భోగభాగ్యాలతో చల్లంగా చూడాలని వేడుకుంటారు. ఆ తరువాత బంధువులు, స్నేహితులతో కలిసి విందు చేసుకొని ఆనందంలో మునిగి తేలుతారు.

బోనాల పండగ రోజు లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిణి మహంకాళి, హరిబౌలి శ్రీ అక్కన్నమాదన్న మహంకాళి మందిరం, ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం, సుల్తాన్‌షాహి శ్రీ జగదాంబ దేవాలయం, బేలా శ్రీ మాతేశ్వరి ము త్యాలమ్మ దేవాలయం, మండిమీర్‌ఆలం శ్రీ మహంకాళేశ్వర దేవాలయం తదితర ప్రధాన దేవాలయాలకు ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనుంది. ఇందు కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రులు ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్‌అలీలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News