- Advertisement -
నల్లగొండ: నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో అక్రమ ఇసుక రవాణాపై అన్నదాతలు కన్నెర్ర చేశారు. అక్రమ ఇసుక రవాణాని అడ్డుకొని అధికారుల తీరుపై మండిపడ్డారు. నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో మోత్కూర్-నార్కట్ పల్లి రోడ్డుపై ఎడ్ల బండ్లతో రైతుల ధర్నా చేపట్టారు. మూసి వాగుపై అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇసుక అక్రమ రవాణా వల్ల గ్రామంలో భూగర్భ జలాలు తగ్గడమే కాకుండా పిల్లలు తాగుడుకు బానిసై పక్కదారి పడుతున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్రమ ఇసుక తరలించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవలని రైతుల డిమాండ్ చేశారు. గంట నుంచి రోడ్డుకి అడ్డంగా ఎడ్ల బండ్లు పెట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
- Advertisement -