Sunday, January 19, 2025

కీసరగుట్టలో శాకాంబరి అలంకరణలో అమ్మవార్లు

- Advertisement -
- Advertisement -

కీసర: ఆషాడ మాసోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కీసరగుట్టలో కొలువైన శ్రీభవాని శివదుర్గా అమ్మవార్లను శాకాంబరిగా అలంకరించారు. అర్చకులు అమ్మవార్లను వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, పూలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. శాకాంబరి అలంకారంలో ఉన్న శ్రీభవాని శివదుర్గా అమ్మవార్లను వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ఛైర్మన్ తటాకం రమేష్ శర్మ, ఈవో నరేందర్, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News