Sunday, December 22, 2024

ఎరువుల ఫ్యాక్టరీ పైపు లీక్..

- Advertisement -
- Advertisement -

చెన్నై : తమిళనాడు ఫర్టిలైజర్ కర్మాగారంలో బుధవారం విషపూరిత అమ్మోనియం గ్యాస్ లీక్ అయింది. సముద్ర తీరంలోని భూగర్భ పైప్‌లైన్ ద్వారా ఉన్నట్లుండి వాయువు వెలువడింది. నార్త్ చెన్నైలో ఈ ఎరువుల కర్మాగారం ఉంది. దీనికి ఈ పైప్ ద్వారానే గ్యాస్ సరఫరా కావడం , ఇది లీక్ కావడంతో స్థానికులు శ్వాసపీల్చుకోలేక ఇబ్బందికి గురయ్యారు. అనేకులు అస్వస్థకు లోనయ్యారు. రాత్రి వరకూ దాదాపు52 మంది వరకూ ఆసుపత్రులలో చేరారు. ఈ ఘటనపై తమిళనాడు కాలుష్య నివారణ మండలి (టిఎన్‌పిసిబి) స్పందించింది.

లీక్ వెంటనే స్పందించినట్లు, నివారణ చర్యలు చేపట్టినట్లు, ఎటువంటి ఆందోళన అవసరం లేదని అధికార ప్రకటన వెలువరించారు. స్థానికులు ఈ ఫ్యాక్టరీని వెంటనే మూసివేయాలని , తమకు ఇక్కడి విషవాయువులు ప్రాణాంతకం అవుతున్నాయని పేర్కొంటూ నిరసనలకు దిగారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే లోపాన్ని సరిదిద్ది, పరిస్థితిని చక్కదిద్దినట్లు పొల్యూషన్ కంట్రోలు బోర్డు తెలిపింది. ఇప్పుడు గాలిలోకి అమోనియా లీక్ ఏదీ లేదని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News