Sunday, December 22, 2024

స్వతంత్రుల్లో బర్రెలక్కకే అత్యధిక ఓట్లు

- Advertisement -
- Advertisement -

కొల్లాపూర్‌లో నాలుగో స్ధానం
5754 ఓట్లు సాధింపు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క సామాజిక మాద్యమాల్లో ఒక ఊపు ఊపి ప్రధాన పార్టీల అభ్యర్థులకు చెమటలు పట్టించింది. ఆమె నిరుద్యోగ యువత తరుఫున ఎన్నికల బరిలో నిలిస్తే ప్రముఖులు మద్దతు పలికి ప్రచారం చేశారు. దీంతో ఆమె పోటీ చేసిన కొల్లాపూర్ రాజకీయంపై తెలంగాణ చూపు పడింది. బడా రాజకీయ నాయకులతో పోటీలో నిలిచిన ఆమెకు బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యం లభించినప్పటికీ ఈవిఎంలో అనుకున్నంత స్థాయిలో ఓట్లు పడలేదు. దీంతో బర్రెలక్క(కర్రె శిరీష) ఈ ఎన్నికల్లో 5,754 ఓట్లను సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News