Wednesday, January 22, 2025

పశు సంవర్ధక శాఖకు అమోయ్ కుమార్

- Advertisement -
- Advertisement -

ఆరుగురు ఐఎఎస్‌ల బదిలీ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆరుగురు ఐఎఎస్ అధికారులను బదిలీ చే స్తూ బుధవారం సి ఎస్ శాంతికుమా రి ఉత్తర్వులు జా రీ చేశారు. హైదరాబాద్, రంగారె డ్డి, మేడ్చెల్- మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్‌గా పనిచేసిన అమోయ్‌కుమార్‌ను పశుసంవర్ధకశాఖ జాయింట్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఇప్పటివరకూ ఆయన పోస్టింగ్ కో సం ఎదురు చూస్తున్నారు. వెయిటింగ్‌లో ఉ న్న ఐఎఎస్ అధికారి ఎన్.శ్రీధర్‌కు ఎస్‌సి అ భివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు.

పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉ న్న టి.వినయ్ కృష్ణారెడ్డిని వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా నియమించారు. ఆర్‌అండ్‌బి శాఖ సంయుక్త కార్యదర్శిగా హ రీశ్, టిఎస్‌ఐఆర్‌డి సిఇఒ దేవి, గనుల శాఖ డైరెక్టర్‌గా సుశీల్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. కాగా, గతప్ర భుత్వంలో కీలకంగా వ్యవహరించిన అమో య్ కుమార్‌ను పభుత్వం పశువర్ధక శాఖ సంయుక్త కార్యదర్శిగా నియమించడం చ ర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News