Wednesday, November 6, 2024

వేర్వేరు స్థలాల్లో మొండెం, కాళ్లు, చేతులు….

- Advertisement -
- Advertisement -

Amputated hands legs torso from 3 different bags

అహ్మదాబాద్: ఓ వ్యక్తిని చంపి మృతదేహాన్ని నాలుగు భాగాలుగా విభజించి వేర్వేరు స్థలాల్లో పడేసిన సంఘటన గుజరాత్ రాష్ట్రం అంక్లేశ్వర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అమృతాపూర్ గ్రామ సమీపంలో ఓ బ్యాగ్ కనిపించడంతో స్థానికులు ఓపెన్ చేసి రెండు చేతులు కనిపించాయి. కొద్దీ దూరంలో మరో బ్యాగ్‌లో రెండు కాళ్లు కనిపించాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెండు బ్యాగ్‌లను స్వాధీనం చేసుకున్నారు. సరంగ్‌పూర్ గ్రామం సమీపంలోని రైల్వే క్రాసింగ్ వద్ద గల బ్యాగ్‌లో తల లేని మొండెం కనిపించిందని పోలీసులు వెల్లడించారు. తల కోసం పోలీసులు వెతుకుతున్నారు. అమృతాపూర్ గ్రామంలో బ్యాగ్ విసిరి వెళ్తుండగా ఆటోవాలా చూసినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి సిసి టివి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహంలోని భాగాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News