Monday, December 23, 2024

టైగర్ రిజర్వు పరిధిలో పకడ్బందీగా గ్రామాల తరలింపు

- Advertisement -
- Advertisement -

అమ్రాబాద్, కవ్వాల టైగర్ రిజర్వులపై మంత్రి సురేఖ సుదీర్ఘ సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్‌ః అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వుల పరిధిలోని గ్రామాల తరలింపు ప్రక్రియను పకడ్భంధీగా చేపట్టాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. తరలింపు ప్రక్రియ ప్రజల భావోద్వాగాలతో ముడిపడి ఉన్నందున, ప్రజలకు ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కల్పిస్తూ పునరావాస ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉత్తర, దక్షిణ సరిహద్దులుగా విస్తరించిన టైగర్ రిజర్వులు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకతను చేకూర్చాయని, వాటిని ప్రత్యేకతను కాపాడేందుకు అటవీశాఖ నిరంతర చర్యలు చేపట్టాలని సూచించారు. డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో మంత్రి, టైగర్ రిజరవ్స్ గవర్నింగ్ బాడీస్ చైర్ పర్సన్ కొండా సురేఖ ఆధ్వర్యంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ల గవర్నింగ్ బాడీ సమావేశం శుక్రవారం జరిగింది.

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకుపల్లి భూపతి రెడ్డి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పిసిసిఎఫ్ (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్, పిసిసిఎఫ్ (వైల్ లైఫ్) ఏలూసింగ్, డిసిసిఎఫ్ ఆంజనేయులు(హెడ్ ఆఫీస్) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఉన్నతాధికారులు టైగర్ రిజర్వ్ ల గవర్నింగ్ బాడీస్, టైగర్ కన్సర్వేషన్ ఫౌండేషన్, గవర్నింగ్ బోర్డుల ఏర్పాటు, విధివిధానాలను మంత్రి సురేఖకు సమగ్రంగా వివరించారు. ప్రాజెక్ట్ టైగర్‌లో భాగంగా 2015 ఏప్రిల్ 29న కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పులుల సంరక్షణే లక్ష్యంగా టైగర్ రిజర్వులను అభివృద్ధి చేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. ఈ దిశగా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చేపడుతున్న చర్యలను వివరించారు.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ – ఫీల్ డైరక్టర్ ప్రాజెక్ట్ డైరక్టర్, సిఎఫ్ రాంబాబు, డిఎఫ్‌ఓ రోహిత్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు సంబంధించిన వివరాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రి సురేఖకి సోదాహరణంగా వివరించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో 26 కోర్ (కేంద్రీకృత) గ్రామాలుండగా, ప్రస్తుతం వాటిలో 4 గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు అధికారులకు మంత్రి సురేఖకు వివరించారు. అతిపెద్ద కోర్ ఏరియా కలిగిన రెండవ టైగర్ రిజర్వుగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నిలవడం పట్ల మంత్రి సురేఖ హర్షం వ్యక్తం చేశారు. పెరుగుతున్న పులుల ఆహారలభ్యతకు అనుగుణంగా జింకల సంఖ్యను పెంచే దిశగా చేపడుతున్న చర్యలను మంత్రి సురేఖ ప్రశంసించారు. సోమశిల, అమరగిరి ఎకో టూరిజం సర్క్యూట్, దోమలపెంట- శ్రీశైలం ఎకో టూరిజం సర్క్యూట్‌లను రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి సురేఖకు అధికారులు తెలిపారు.

దోమలపెంట-శ్రీశైలం ఎకో టూరిజం సర్క్యూట్‌లో భాగంగా ఎంతో ప్రాశస్త్యమైన అక్కమహాదేవి గుహలకు తెలంగాణ ప్రభుత్వపరంగా భూ, జలమార్గాల్లో భక్తులకు యాత్రా సౌకర్యం కల్పించేందుకు గాను అవకాశాలను పరిశీలించాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటి (ఎన్ టిసిఎ) కింద చేపడుతున్న పునరావాస వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. పునరావాస ప్రక్రియలో భాగంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని మైసంపేట్, రాంపూర్ గూడేలను తొలి విడతగా ఖాళీ చేయించినట్లు అధికారులు మంత్రి సురేఖ గారికి వివరించారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కవ్వాల్ టైగర్ రిజర్వ్ – ఫీల్ డైరక్టర్ ప్రాజెక్ట్ డైరక్టర్, సిఎఫ్ శాంతారాం మంత్రి సురేఖకు వివరించారు. వన్యప్రాణుల దాడుల ఘటనల్లో మరణించిన వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని రూ.10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి సురేఖ ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News