Monday, January 20, 2025

జిహెచ్‌ఎంసి కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి కాట

- Advertisement -
- Advertisement -

జిహెచ్‌ఎంసి నూతన కమిషనర్ గా ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలి కాట బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో ఐఏఎస్ ల బదిలీల నేపథ్యంలో జిహెచ్‌ఎంసి కమిషనర్ గా ఉన్న రోనాల్డ్ రోస్ ను ప్రభుత్వం బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో ఆమ్రపాలి కాట కు జిహెచ్‌ఎంసి కమిషనర్ గా పూర్తిస్థాయి అదనపు భాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు రోనాల్డ్ రోస్ నుండి ఆమె బాధ్యతలను బుధవారం స్వీకరించారు. అనంతరం ఆమ్రపాలి మాట్లాడుతూ…

ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరి సహాకారం తీసుకుంటానని వెల్లడించారు. ఈసందర్భంగా జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా ఆమెను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్, శేరిలింగంల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి లు కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News