Monday, December 23, 2024

సుప్రీం కోర్టులో అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌కు భారీ ఊరట

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్‌కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. క్యాస్ట్ సర్టిఫికెట్ పై నవనీత్ కౌర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నవనీత్ కౌర్ ఎస్సీ కాదంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. నవనీత్ కౌర్ 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. శివసేన అభ్యర్థి ఆనందరావుపై విజయం సాధించారు.

అయితే ఆమె నకిలీ పత్రాలతో ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం పొందారని శివసేన మాజీ ఎంపీ ఆనందరావు ఆరోపించారు. ఈ మేరకు బాంబే హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. కౌర్ కుల ధ్రువీకరణ పత్రం అబద్ధమని బాంబై హైకోర్టు గుర్తించి, దాన్నిరద్దు చేయడంతోపాటు రూ. 2 లక్షల జరిమానా విధించింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నవనీత్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తాజాగా నవనీత్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.బాంబే హైకోర్టు తీర్పును కొట్టి వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News