Monday, October 7, 2024

హైదరాబాద్‌లో అమ్రీష్ పురి మనవడు.. చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడే.. టాలీవుడ్‌లో మెరిస్తే సూపర్

- Advertisement -
- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన విలన్లు ఎందరో ఉన్నారు. వారిలో మనకి ముందుగా అమ్రీష్ పురినే గుర్తుకొస్తాడు. మేజర్ చంద్రకాంత్, ఆదిత్య 369, జగదేకవీరుడు అతిలోకసుందరి, కొండవీటి దొంగ వంటి సినిమాల్లో అమ్రీష్ పురి అద్భుతమైన పాత్రలు పోషించాడు. అమ్రీష్ అనారోగ్యంతో 2005లో కన్నుమూశాడు. అయితే అమ్రీష్ పురి మనవడు ఇటీవల కాలంలో బాగా హైలైట్ అవుతున్నాడు. ఇప్పటిదాకా హిందీ పరిశ్రమకే పరిమితమైన ఈ నటుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్రీష్ పురి నట వారసత్వాన్ని కొనసాగించేలాగానే కనిపిస్తున్నాడు. అమ్రీష్ పురి మనవడి పేరు వర్ధన్ పురి. ఈ యాక్టర్ ఇవాళ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో కాలు మోపాడు.

ఆయనకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. వీటిలో అతను చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలు చూసి టాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వర్ధన్ తెలుగు సినిమాల్లో కూడా నటించి తన తాత లాగా మెప్పించవచ్చు కదా అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

వర్ధన్ ఐదేళ్ల వయసు నుంచి నాటకాలు వేయడం ప్రారంభించాడు. అంతేకాకుండా, యష్ రాజ్ ఫిల్మ్స్ అనే ప్రముఖ సినిమా సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆయన మొదటగా రొమాంటిక్ థ్రిల్లర్ ఫిలిం ‘యే సాలి ఆషికీ (2019)లో హీరోగా నటించాడు. ఈ సినిమాకి కథ కూడా అతనే రాశాడు. ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత, హారర్ మూవీ ‘అసెక్’, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ‘దశమి’లో కూడా నటించాడు.

వర్ధన్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటైన “బ్లడీ ఇష్క్” సినిమాకు విక్రమ్ భట్, మహేష్ భట్ దర్శకత్వం వహిస్తున్నారు. అతను చేస్తున్న ఇంకొక సినిమా అయిన “బాబీ అవుర్ రిషి కి లవ్ స్టోరీ”కి కునాల్ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను జియో స్టూడియోస్ నిర్మిస్తున్నారు. వర్ధన్ మరో మూవీ “గులాబ్”కి సంజయ్ నాగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఎండెమోల్ నిర్మిస్తోంది. శేఖర్ కపూర్ దర్శకత్వం వహిస్తున్న మరో సినిమా కూడా ఆయన చేస్తున్నాడు. దీనికి ఇంకా పేరు పెట్టలేదు.

వర్ధన్, దర్శకుడు శేఖర్ కపుర్‌ కాంబోలో వస్తున్న సినిమాకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే 37 ఏళ్ల క్రితం శేఖర్ కపుర్ వర్ధన్ తాతయ్య అమ్రీష్ నటించిన ‘మిస్టర్ ఇండియా’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో అమ్రీష్ ‘మొగాంబో’ అనే పాత్ర పోషించారు. ఈ పాత్ర చాలా పాపులర్ అయింది. వర్ధన్ శేఖర్ కపూర్‌తో పనిచేయడం గర్వంగా అనిపిస్తుందని చెప్పాడు.

వర్ధన్ ‘నెక్స్ట్ టు గాడ్’ అనే మెడికల్ బ్యాక్ డ్రాప్ గల సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. శేఖర్ కపూర్ ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సినిమాను భారతీయ వైద్యులు ఎదుర్కొన్న నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీస్తున్నారు. ఇందులో డాక్టర్లకు భద్రత అవసరమని నొక్కి చెప్పనున్నారు. వర్ధన్ ఈ సినిమాలో నటించడం కష్టమేనా అని అడిగినప్పుడు, ఆయన తనకు ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పాడు. మరి ఈ హీరో తెలుగులో ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News