Monday, December 23, 2024

వాడు చేసిన మోసంతో నా గుండె ముక్కలైంది: అమృతా రావు

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ అందాల నటీమణులలో అమృతా రావు ఒకరు. సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ వాంటెడ్‌ సినిమాలో నటించే అవకాశాన్ని మేనేజర్ చేసిన మోసంతో కోల్పోయానని హీరోయిన్ అమృతారావు వెల్లడించారు. సినిమా ఒక రంగుల ప్రపంచమన్న ఆమె, ఇక్కడ ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో చెప్పడం కష్టమన్నారు. తాగాజా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన ఆమె పలు విషయాలను బయటపెడ్డారు.

నాడేట్స్ లేవని మేనేజర్ చెప్పడంతో సల్మాన్ ఖాన్ వాంటెడ్ లో వేరే హీరోయిన్ ను తీసుకున్నామని నిర్మాత బోనీ కపూర్ అనుచరులు చెప్పారని తెలిపారు. దీంతో తన గుండె బద్దలయ్యిందన్నారు. ఆఫర్ వచ్చిన విషయమే మేజేజర్ తనకు చెప్పలేదన్నారు. తన దగ్గర నుంచి వెళ్లిపోవడానికి అతను ఈ ఫ్లాన్ వేశాడని ఆమె గుర్తుచేసుకున్నారు. వివాహ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంలోనే భారీ విజయాన్ని అందుకున్నారు అమృతరావు. అ అమ్మడు తెలుగులో మహేష్ బాబు సరసన అతిధి సినిమాలో నటించి అందరినీ మెప్పించిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News