Wednesday, January 22, 2025

పోలీసుల నుంచి తప్పించుకున్నా: వీడియోలో అమృత్‌పాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పంజాబ్ పోలీసులకు దొరకకుండడా తప్పించుకు తిరుగుతున్న ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ మొదటిసారి తన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మార్చి 18న పంజాబ్ పోలీసులు ఉచ్చు బిగించడంతో వారి నుంచి తప్పించుకుని అమృత్‌పాల్ పరారయ్యారు. బైశాఖి సందర్భంగా సర్బత్ ఖల్సా(సిక్కుల సమావేశం) జరపాలని సిక్కులకు అతను పిలుపు ఇచ్చారు.

దేశంలోని, విదేశాల్లోని సిక్కు సంస్థలన్నీ ఈ సమావేశానికి వచ్చి సిక్కు మతస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించాలని ఆయన కోరారు. అరెస్టు చేసిన అనంతరం అస్సాంకు తరలించిన తన అనుచరుల గురించి కూడా అమృత్‌పాల్ వీడియోలో ప్రస్తావించారు. సర్బత్ ఖల్సాను నిర్వహించే బాధ్యతను చేపట్టాలని అకాల్ తఖ్త్ జతేదార్‌కు అమృత్‌పాల్ విజ్ఞప్తి చేశారు. తాను క్షేమంగానే ఉన్నానని, పోలీసుల చెర నుంచి తప్పించుకోగలిగానని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News