Friday, November 22, 2024

సిసిటివీలో అమృత్‌పాల్ సింగ్ ఆచూకీ?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దాదాపు ఎనిమిది రోజుల నుంచి పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ వేషం మార్చాడు. ఆయన సంప్రదాయ వస్త్రాలను కాకుండా జాకెట్, ప్యాంటు, నల్లకళ్లజోడు ధరించి నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఓ సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. మార్చి 20న అమృత్‌సర్‌లో తన బంధువుల ఇంట్లో ఆయన గడిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అమృత్‌సర్ నుంచి హర్యానాలోని కురుక్షేత్రకు వెళ్లినట్టు, కురుక్షేత్ర నుంచి ఓ సాధు వేషంలో శుక్రవారం ఢిల్లీ నగరానికి వెళ్లినట్టు తెలుస్తోంది.

ఢిల్లీ కశ్మీర్ గేటు లోని ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ వద్ద ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కురుక్షేత్ర లోని బల్జీత్ కౌర్ అనే మహిళ ఇంటి నుంచి వెళ్తుండగా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆమె ఇంట్లో ఆయనతోపాటు ఆయన సహచరుడు పపల్ ప్రీత్ సింగ్ కూడా ఆశ్రయం పొందినట్టు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ఆ మహిళను హర్యానా పోలీసులు అరెస్టు చేసి పంజాబ్ పోలీసులకు అప్పగించారు. ప్రజల్లో అశాంతి రగిలించడం, హత్యాయత్నం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటి ఆరోపణలు అమృత్ సింగ్‌పై నమోదయ్యాయి. గత శనివారం నుంచి ఆయనను పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News