Tuesday, November 5, 2024

అసోం జైలు నుంచే గెలిచాడు

- Advertisement -
- Advertisement -

పంజాబీ తీవ్రవాద నేత అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లోని ఖాదూర్ సాహిబ్ నుంచి లోక్‌సభ ఎన్నికలలో గెలుపొందారు. తీవ్రవాద ప్రచార అభియోగాలపై ఆయన ఇప్పుడు అసోం దిబ్రూగఢ్ జైలులో ఉన్నాడు. జైలు నుంచి పోటీచేసిన అమృత్‌పాల్ ఆదినుంచి సమీప కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జిరాపై ఆధిక్యత చాటుకుంటూ వచ్చారు.ఆయన లక్షన్నర ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు అధికారికంగా వెల్లడైంది.

వారిస్ పంజాబ్ దే అధినేతగా ప్రకటించుకున్న అమృత్‌పాల్ జైలులో ఉంటూనే గెలవడం ఎన్నికల ఘట్టంలో సంచలనాత్మకం అయింది. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలపై జాతీయ భద్రతా చట్టం పరిధిలో పాల్‌ను జైలుకు పంపించారు. ఇందిరా గాంధీ హంతకులలో ఒక్కరైన బియాంత్ సింగ్ పెద్ద కుమారుడు సరబ్‌జిత్ సింగ్ ఖాల్సా ఫరీద్‌కోట్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయపథంలో ఉన్నారు. పంజాబ్‌లో ఈ రెండు స్థానాల ఫలితాలు సంచలనాత్మకం అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News