Monday, December 23, 2024

ఫ్లోరైడ్ పై సుదీర్ఘ పోరాటం చేసిన అంశాల స్వామి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

నల్గొండ:  మర్రిగూడ మండలం శివన్నగూడెం కు చెందిన ఫ్లోరైడ్ విముక్తి పోరాట యోధుడు అంశాల స్వామి శనివారం ఉదయం అనారోగ్యంతో  చెందాడు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గత ముప్పై ఏళ్లుగా నల్గొండ జిల్లా లో మునుగోడు లో ఫ్లోరైడ్ మహమ్మారి పై రాజీలేని పోరాటం చేశారు. జలసాధన సమితి లో దుస్సర్ల సత్యనారాయణ తో కలిసి  ప్రధానులను కలిశారు.

2011 లో ఉమ్మడి నల్గొండ జిల్లా లో హెచ్ఎంటీవీ అధ్వర్యంలో నిర్వహించిన ఫ్లోరైడ్ విముక్తి పోరాట యాత్రలో భాగస్వామ్యం అయినారు. 3 నెలల క్రితం అంశాల స్వామి గృహప్రవేశానికి మంత్రి కెటిఆర్ హాజరయ్యారు. అంశాల స్వామి మృతి పట్ల కెటిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. అంశాల స్వామి  ఆత్మకు శాంతి చేకూరలని మంత్రి ప్రార్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News