Tuesday, November 5, 2024

ఆమ్టెక్ గ్రూప్, డైరెక్టర్ల ఆస్తులపై ఈడి దాడులు

- Advertisement -
- Advertisement -

ముంబై: మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈడి గురువారం ఆమ్టెక్ గ్రూప్, దాని డైరక్టర్ల నివాసాలపై గురువారం సోదాలు జరిపింది. కంపెనీ, దాని ప్రమోటర్లు రూ. 20,000 కోట్లకు పైగా బ్యాంకు రుణం మోసానికి పాల్పడినందున ఈడి దర్యాప్తు జరుపుతోంది. సిబిఐ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయగా ఆ తర్వాత ఈడి దర్యాప్తులోకి దిగింది. ఆమ్టెక్ గ్రూప్, అరవింద్ ధామ్, గౌతమ్ మల్హోత్రకు చెందిన వ్యాపారాలు , నివాస స్థలాలపై దాడులు జరిగాయి.

లిస్టెడ్ కంపెనీల షేర్లలో అవకతవకలు జరిగాయని, ఆడిటర్ల సహకారంతో ఫైనాన్షియల్ రికార్డులు తారుమారు చేసి అధిక రుణాలు పొందడానికి మోసానికి పాల్పడ్డారని ఆరోపణ. రుణ నిధులను అక్రమంగా రియల్ ఎస్టేట్, విదేశీ పెట్టుబడులు, కొత్త వెంచర్ల వైపుకు మళ్లించినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News