- Advertisement -
అలీఘఢ్: అలీఘఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఎఎంయు) 100 ఏళ్ల చరిత్రను తెలియజేసే టైమ్ క్యాప్సుల్‌ను నిక్షిప్తం చేశారు. విక్టోరియా గేట్ వద్ద 30 అడుగుల లోతున 1.5 టన్నుల స్టీల్ క్యాప్సుల్‌ను పాతిపెట్టారు. అందులో యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన చారిత్రక దస్త్రాలను భద్రపరిచారు. మంగళవారం 72వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ తారిఖ్ మన్సూర్ ప్రసంగిస్తూ చరిత్రను స్మరించుకోలేనివారు దానిని పునరావృతం చేస్తారంటూ ప్రముఖ స్పానిష్ తాత్వికుడు జార్జి సంతయానా అన్న మాటల్ని గుర్తు చేశారు. టైమ్ క్యాప్సుల్‌లో 1920లో ఎఎంయు ఏర్పాటుకు సంబంధించిన చట్టంతోపాటు స్నాతకోత్సవాల సంక్షిప్త సమాచారాన్ని భద్రపరిచారు.
- Advertisement -