Monday, December 23, 2024

రాజకీయ వేడిని పెంచిన అమూల్ పాలు..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్ణాటకలో అమూల్ పాల విక్రయం రాజకీయ వేడెక్కించింది. కర్ణాటకలో అమూల్ పాల వ్యాపారాన్ని విస్తరిస్తామని అమూల్ ప్రకటించింది. అందుకు ప్లాన్ చేయడం అధికార బీజేపీకి చిక్కులు తెచ్చి పెట్టింది. ఇందులో భాగంగానే స్థానికంగా ఉన్న నందిని సంస్థను అమూల్‌లో విలీనం చేయాలనే వార్తలు బయటకు రావడంతో ఒక్కసారిగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో అమూల్ పాల ఉత్పత్తులను రానిచ్చే ప్రసక్తే లేదంటూ కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమూల్ పాల సరఫరాపై నిషేధం విధించాలని ప్రతిపక్ష నేతలతోపాటు అనేక కన్నడ సంస్థలు డిమాండ్ చేశాయి.

గుజరాత్‌కు చెందిన అమూల్‌కు కట్టబెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక పాడి ఉత్పత్తిదార్ల సహకార సంఘాల సమాఖ్యకు చెందిన నందిని బ్రాండ్ పాలకు బెంగళూరు హోటళ్ల యజమానుల సంఘం పూర్తి మద్దతు ప్రకటించింది. ఇకపై మహానగరంలోని తమ హోటళ్లలో నందిని పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తామని ప్రకటించింది. కేఎంఎఫ్‌ను, రాష్ట్రంలోని పాడి రైతులను ఆదుకోడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని బృహత్ బెంగళూరు హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు పీసీరావ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News