- Advertisement -
ఆనంద్ (గుజరాత్) : ప్రఖ్యాత అమూల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్‌ఎస్ సోధీ రోడ్డు ప్రమాదంలో స్వల్పగాయాలకు గురి అయ్యారు. గుజరాత్‌లోని ఆనంద్‌టౌన్ వద్ద బుధవారం రాత్రి చాలా పొద్దు పోయిన తరువాత ఆక్సిడెంట్ జరిగింది. దేశంలో ప్రముఖ డెయిరీ కోఆపరేటివ్ అయిన జిసిఎంఎంఎఫ్ అమూల్ పేరిట అందరికి పరిచయమే. ఆయన ప్రయాణిస్తున్న కారు బాక్రోల్ రోడ్డు వద్ద డివైడర్‌ను ఢీకొనడంతో అదుపు తప్పి తలకిందులు అయిందని, దీనితో సోధీ గాయపడ్డారని డిఎస్‌పి బిడి జడేజా విలేకరులకు తెలిపారు. విషయం తెలియగానే ఆయనను ఆసుపత్రికి తరలించారు. చికిత్స జరుగుతోంది.
- Advertisement -