Monday, December 23, 2024

అమూల్ పాల ధర లీటరుకు రూ.2 పెంపు

- Advertisement -
- Advertisement -

ఆనంద్: అమూల్ పాల ధర లీటరుకు రూ.2పెరిగింది. పెరిగిన ధరలు గుజరాత్ మినహా దేశవ్యాప్తంగా వర్తించనున్నాయి. అమూల్ పాల ధరను పెంచుతున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్) శుక్రవారం తెలిపింది. అమూల్ పాలు అన్ని బ్రాండ్లపై లీటర్‌కు రెండు రూపాయలు పెంచినట్లు ప్రకటించింది. జిసిఎంఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా కొత్త రేట్లు ముంబై, కోల్‌కతా, ఢిల్లీ తదితర అన్ని మార్కెట్లు వర్తిస్తాయని అయితే మార్కెట్‌ను మినహాయించినట్లు తెలిపారు. అమూల్ పాల కొత్త ధరలు శుక్రవారం ఉదయం నుంచే అమలులోకి వచ్చినట్లు జిసిఎంఎంఎఫ్ ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News