గుజరాత్ : అమూల్ తమ బ్రాండ్ల పాల ధరలను మంగళవారం పెంచింది. గోల్డ్, తాజా, శక్తి బ్రాండ్ల పాల ప్రస్తుత ధరలపై రూ.2అదనంగా పెంచింది. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్) అమూల్ బ్రాండ్‌పై పాల ఉత్పత్తులను మార్కెట్ చేస్తోంది. పెంచిన ధరలు బుధవారం నుంచి అమలవుతాయని జిసిఎంఎంఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. పాల సేకరణ, నిర్వహణ వ్యయం పెరగడంతో తమ పాలధరలను పెంచినట్లు కంపెనీ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత ఎంఆర్‌పి ధరలపై 4శాతం చొప్పున లీటర్‌కు రెండు రూపాయలు పెంచామని జిసిఎంఎంఎఫ్ తెలిపింది. ఆహార ద్రవ్యోల్బణంలో ఇది చాలా తక్కువశాతమని అమూల్ ప్రతినిధులు తెలిపారు. అహ్మదాబాద్, గుజరాత్‌లోని సౌరాష్ట్ర రీజియన్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ముంబైతోపాటు ఇతర మార్కెట్లకు అమూల్ సరఫరా చేస్తున్న తాజా పాలపై ధరలు పెంచినట్లు ఆనంద్‌లోని ఫెడరేషన్ ప్రధాన కార్యాలయం పేర్కొంది. సౌరాష్ట్ర మార్కెట్లలో 500ఎంఎల్ అమూల్ గోల్డ్ రూ.31, అమూల్ తాజా రూ.25, శక్తి రూ.28గా ఉన్నట్లు సమాఖ్య వెల్లడించింది. గతేడాదికంటే పశుగ్రాసం ధరలు 20శాతం పెరగడంతో పాడిరైతుల శ్రేయస్సు దృష్యా పాల ధరలు పెంచామని జిసిఎంఎంఎఫ్ పేర్కొంది. చెల్లించి ప్రతి రూపాయిలో 80పైసలు పాల ఉత్పత్తిదారులకు చెల్లించాలనేది అమూల్ పాలసీగా ఫెడరేషన్ తెలిపింది.
అమూల్ పాలధరలు లీటర్‌కు రూ. 2 పెంపు
- Advertisement -
- Advertisement -
- Advertisement -