Wednesday, January 22, 2025

కోలుకోలేని వ్యాధి అమిలోయిడోసిస్

- Advertisement -
- Advertisement -

అమిలోయిడోసిస్ అనేది అరుదైన వ్యాధి శరీరంలో అసాధారణమైన అమిలాయిడ్ పదార్థాలు ఏర్పడడం వల్ల ఈ వ్యాధి ఏర్పడుతుంది. గుండె, మెదడు, మూత్రపిండాలు, ప్లీహం, శరీరం లోని ఇతర భాగాల్లో అమిలాయిడ్ పదార్థాలు ఏర్పడతాయి. ఒక వ్యక్తికి ఒక అవయవం లేదా అనేక అవయవాల్లో అమిలోయిడోసిస్ ఉండవచ్చు. జన్యువు లోని ఉత్పరివర్తన కారణంగా కొన్నిసార్లు అమిలోయిడోసిస్ ఏర్పడవచ్చు.

దీర్ఘకాలిక మూత్రపిండ డయాలసిస్‌ను చేయించుకునే వ్యక్తుల్లో ఒకరకమైన అమిలోయిడోసిస్‌ను అభివృద్ది చేసే ప్రమాదం ఉంది. అయితే ఆధునిక డయాలసిస్ పద్ధతులు దీన్ని తక్కువగా చేస్తాయి. అమిలోయిడోసిస్ ఉన్నవారిలో దాదాపు 70 శాతం మంది పురుషులు ఉన్నారు. అమిలోయిడోసిస్‌కు చికిత్స లేదు. ఇది కోలుకోవడం సాధ్యం కాని వ్యాధి. తీవ్రమైన అమిలోయిడోసిస్ ప్రాణాంతక అవయవ వైఫల్యానికి దారి తీస్తుంది. కానీ చికిత్సలు ఈ వ్యాధి లక్షణాలను తగ్గించడానికి , అమిలాయిడ్ ప్రొటీన్ ఉత్పత్తిని పరిమితం చేయడానికి సాయపడతాయి.

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అమిలోయిడోసిస్ వ్యాధి వల్లనే తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. పెద్దవారిలో అమిలోయిడోసిస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అమిలోయిడోసిస్ మల్టిపుల్ మైలోమా అని పిలువబడే క్యాన్సర్ రూపంలో 15 శాతం మంది రోగులను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలంగా డయాలసిస్‌లో ఉన్న చివరిదశ మూత్రపిండ వ్యాధి ఉన్న వారిలో కూడా అమిలోయిడోసిస్ సంభవించే ప్రమాదం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News