Thursday, January 23, 2025

ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తి ఆక్రమించుకునే ప్రయత్నం

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూములు రోజు, రోజుకి కనుమరుగౌతున్నాయని బిజెపి పార్టీ నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడు ఆకుల సతీష్ ముదిరాజ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఆరు నెలల క్రితం 20 డివిజన్ పరిధిలోకి వచ్చే పూర్వ బాచుపల్లి గ్రామ సర్వే నెంబర్ 110 లో రోడ్డు పోను దాదాపు 500 గజాల ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తి భవన నిర్మాణం చేపడితే రెవిన్యూ అధికారులు చర్య తీసుకోలేక పోయారని, నిజాంపేట్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 342 లోని ప్రభుత్వ భూమి కూడా కనుమరుగయ్యిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం సర్వే నెంబర్ 109 లో 7.63 ఎకరాల విస్తర్ణంలో ఉన్న ప్రభుత్వ భూమిలో దాదాపు 600 గజాల భూమిని ఒక ప్రైవేటు వ్యక్తి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన అన్నారు.
హెచ్‌ఎండిఏ అనుమతులు రద్దు చేయాలి
ప్రభుత్వ భూమియైన సర్వే నెంబర్ 109 పక్కల ప్రైవేటు సర్వే నంబర్ల (165,126 ) ల యజమాని తన స్థలంలో భవన సముదాయాల నిర్మాణ అనుమతి కొరకు 109 సర్వే నంబర్లో ఉన్న దాదాపు 600 గజాల స్థలం ను తన భవన సముదాయ నిర్మాణానికి రహదారిగా చూపుతూ తప్పుడు పత్రాలు చూపించి అనుమతి పొదినందుకు హెచ్‌ఎండి ఏ అధికారులు సదరు నిర్మాణ అనుమతిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేటు వ్యక్తి తన నిర్మాణానికి ప్రభుత్వ భూమి నుండి రహదారి చూపడానికి స్కెచ్ వేసి, సహకరించిన రెవిన్యూ అధికారులపై చర్య తీసుకోవాలని త్వరలోనే మేడ్చెల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News