Wednesday, January 22, 2025

బాహ్య సౌరవ్యవస్థలో భూమిని పోలిన గ్రహం

- Advertisement -
- Advertisement -

భూమికి 15 లక్షల మైళ్ల దూరంలో అంతరిక్షంలో ఏడాదిగా ఉంటున్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇప్పుడు గ్రహాల కోసం వేటాడుతోంది. బాహ్య సౌరవ్యవస్థలో ఒక గ్రహాన్ని కనుగొంది. ఈ గ్రహాన్ని ఎల్‌హెచ్‌ఎస్ 475 బి గా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. ఇది ఇంచుమించు 99 శాతం మన భూమంత పరిమాణంలో ఉంది. నాసా ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (టిఇఎస్‌ఎస్) గ్రహించిన డేటా సాయంతో జేమ్స్‌వెబ్ టెలిస్కోప్ ఈ గ్రహాన్ని కనుగొనగలిగింది.

భూమికి 41 కాంతి సంవత్సరాల దూరంలో ఆక్టేన్ రాశిలో ఉంది. ఆక్టేన్ రాశి అంటే హైడ్రోకార్బన్ వాయువుతో కూడిన ద్రవ్యరాశిలో ఉంది. ఇది కొద్దిగా శిలామయమైన గ్రహంగా ఆకర్షిస్తోందని దీన్ని అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్త లుస్టిగ్ యేగెర్ వివరించారు. జాన్స్‌హోప్‌కిన్స్ యూనివర్శిటీ అప్లైడ్ ఫిజిక్స్ లేబొరేటరీకి చెందిన కెవిన్ స్టీవెన్సన్, జాకబ్ లుస్టిగ్ యేగెర్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.

ఇతర టెలిస్కోప్‌లకు భిన్నంగా ఈ వెబ్ టెలిస్కోప్ భూమి సైజులో ఉన్న బాహ్యగ్రహాల తత్వాన్ని పరిశీలిస్తుంది. ఈ గ్రహ వాతావరణం ఏమిటో సమీక్షించడానికి ఈ పరిశోధక బృందం ప్రయత్నిస్తోంది. శిలామయమైన భూమి వంటి బాహ్య గ్రహాన్ని మొదటిసారి కనుగొనడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి గ్రహాల వాతావరణాన్ని వెబ్ టెలిస్కోప్ ద్వారా మరింత ముమ్మరంగా పరిశోధించడానికి మార్గం ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మన సౌరవ్యవస్థ బయట భూమి వంటి ప్రపంచాన్ని కొత్తగా అర్థం చేసుకోడానికి ఇది చేరువ చేసిందని, ఇలాంటి మిషన్ ఇప్పుడే ప్రారంభమైందని నాసా ప్రధాన కేంద్రం ఆస్ట్రోఫిజిక్స్ డివిజన్ డైరెక్టర్ మార్క్ క్లాంపిన్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News