- Advertisement -
జమ్మూకాశ్మీర్ లో భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 2.53 గంటల సమయంలో కిష్త్వార్ లో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 3.8గా భూకంప తీవ్రత నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది.
కాగా, శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలోనూ రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో వరుస భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.భూ ప్రకంపనల కారణంగా ఆస్థి నష్టంపై వివరాలు ఇంకా అందనట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -