- Advertisement -
తీవ్రత 7, కదిలిన భవనాలు
టోక్యో: జపాన్ ఉత్తర ప్రాంతంలో శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7గా నమోదైంది. భూకంప కేంద్రం మియాగీ తీరంలో 54 కిలీమీటర్ల లోతున ఉన్నట్టు గుర్తించారు. భూకంపం ధాటికి టోక్యో నగరంలోనూ భవనాలు షేకయ్యాయి. దాంతో, నగర ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం లేదని అధికారులు తెలిపారు. ప్రకంపనలు నమోదైన చోట బుల్లెట్ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. తీర ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే, గంటన్నర తర్వాత పరిస్థితి సాధారణస్థితికి రావడంతో ఉపసంహరించారు.
- Advertisement -