Thursday, January 23, 2025

ఎన్నికల నిర్వహణ ప్రణాళిక తయారు చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

గద్వాల : పకడ్బందీగా రెండో విడత ఓటర్ జాబితా రూపొం దించాలని , ఇంటింటి సర్వే ప్ర క్రియ కట్టుదిట్టంగా సకాలంలో పూర్తి చేయాలని, ఓటర్ జాబితా నుండి తొలగించిన ఓటర్ల వివరాల ధృవీకరణపై నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నద్ధత కార్యక్రమాలను పకడ్బందీగా పూర్తి చేయాలని, ఎన్నికల నిర్వహణ ప్రణాళిక తయారు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తహసీల్దార్లను ఆదేశించారు.

గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఓటర్ల జాబితా సన్నద్ధతపై జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్‌తో కలిసి త హసీల్దార్లు, బిఎల్‌ఓలతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధ్ద కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు భారత ఎన్నికల కమిషన్ జూన్ 23న ప్రత్యేక సమా వేశం నిర్వహిస్తుందని, దీని కోసం పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని అన్నారు. గద్వాల నియోజకవర్గం పరిధిలో ఓటర్ల తొలగింపు వాటి వివరాలను మరోసారి ధృవీకరిం చాలని సూచించారు.

క్షేత్ర స్థాయి ధృవీకరణ ప్రక్రియపై నివేదిక తయారు చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి మండలంలో పోలింగ్ కేంద్రాల వివరాలను సమర్పించాలని, పోలింగ్ కేంద్రాలలో ఉన్న మౌలిక వసతులు, దివ్యాంగుల కోసం చేసిన ఏర్పాట్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ , టాయ్లెట్ సౌక ర్యం ఉన్నదా లేదా పరిశీలించాలని, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్, తహసీల్దార్ లు , ఎంపీడీఓలు , ఎంపీడీఓ లు, పంచాయతీ సెక్రటరీలు, సి. సెక్షన్ సూపరింటెండెంట్ వరలక్ష్మీ, నరేష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News